ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి (Allu Arjun Sneha Reddy) దంపతులది ఎంతో ముచ్చటైన జంట. వేడుకల్లో, పండగల్లో ఈ జంట చేసే హడావుడికి అభిమానులు ఫిదా అయిపోతుంటారు. తన పిల్లలు అయాన్, అర్హాలతో బన్నీ చేసే సందడి అంతా ఇంతా కాదు. మీడియాకు దూరంగా ఉన్నా.. కుటుంబంలోని (Allu Arjun Family) ఈ సంతోషాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో సామాజిక మాధ్యామాల్లో పంచుకుంటుంది స్నేహ.
బన్నీ-స్నేహ రొమాంటిక్ వీడియో.. ఫ్యాన్స్ ఫిదా!
అల్లు అర్జున్‌తో ఉన్న ఓ అందమైన వీడియోను అభిమానులతో పంచుకుంది అతడి భార్య స్నేహ రెడ్డి (Allu Arjun Sneha Reddy). ఈ రొమాంటిక్ వీడియో చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
అల్లు అర్జున్
'పుష్ప' చిత్రీకరణలో (Pushpa) ఇన్ని రోజులూ బిజిబిజీగా గడిపిన బన్నీ.. ఇటీవలే కుటుంబంతో మాల్దీవులు విహారయాత్రకు వెళ్లాడు. అక్కడ ఓ పడవలో అతడితో ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది స్నేహ. దానికి 'నువ్వు నాతో ఉన్నంత కాలం ప్రతిదీ బాగుంటుంది' అని కామెంట్ పెట్టింది. ఈ వీడియో చూసిన అభిమానులు.. ఈ బన్నీ దంపతుల సాన్నిహిత్యానికి ముచ్చటపడిపోతున్నారు.
ఇదీ చూడండి:మన రిలేషన్‌పిప్ గురించి ఆ రోజే చెప్తా: పూజాహెగ్డే