ఇప్పటికే దేశంతో సంబంధం లేకుండా ఎంతోమంది సెలబ్రిటీల మనసు దోచిన 'బుట్టబొమ్మ' పాటకు, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ తనయుడు ఫిదా అయ్యాడు. ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న ఆ చిన్నారి.. టీవీలో వస్తున్న గీతానికి అనుగుణంగా, కాలు కదుపుతూ ఆనందం వ్యక్తం చేశాడు. ఆ వీడియోను ఏక్తా తన ఇన్స్టాలో పంచుకున్నారు. తన కుమారుడికి ఇష్టమైన పాట ఇదంటూ రాసుకొచ్చారు.
దీనిపై స్పందించిన హీరోయిన్ పూజాహెగ్డే.. చిన్నపిల్లలతో పాటు ప్రతిఒక్కరూ ఈ పాటను అభిమానిస్తుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందనే వ్యాఖ్య జోడించింది. ఆర్మాన్ మాలిక్, కార్తిక్ ఆర్యన్ సహా పలువురు ఈ వీడియోపై కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.