Allu arjun ala vaikunthapurramuloo: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. గత కొన్నిరోజుల వరకు తెలుగు హీరో. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. 'పుష్ప'గా సంచలనం సృష్టించిన బన్నీ.. ఈ సినిమా హిందీ వెర్షన్‌తో రికార్డు స్థాయిలో దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్లు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో బాలీవుడ్ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
2020 జనవరిలో 'అల వైకుంఠపురములో' సినిమాతో అల్లు అర్జున్, టాలీవుడ్లో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఇప్పుడు ఈ చిత్రం హిందీ వెర్షన్‌నే ఈ జనవరి 26న నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు.
ఇవీ చదవండి:బన్నీ సినిమా రిలీజ్ ఆపేందుకు రూ.8కోట్లు ఖర్చు చేశారా?