తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వాళ్లు నా గురించి సెట్​కు వచ్చారనుకున్నా.. కానీ? - ala vaikunthapurramuloo news

'అల వైకుంఠపురములో' షూటింగ్​ అప్పుడు తన స్నేహితులు అప్పుడప్పుడు సెట్​లో కనబడేవారని చెప్పిన హీరో అల్లు అర్జున్.. అందుకు గల కారణాన్ని వివరించాడు. తన కోసం కాకుండా వేరే వారిని చూసేందుకు వచ్చేవారని అన్నాడు.

వాళ్లు నా గురించి సెట్​కు వచ్చారనుకున్నా.. కానీ?
అల్లు అర్జున్-పూజా హెగ్డే

By

Published : Jan 11, 2020, 7:14 PM IST

స్టైలిష్​ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపే(శనివారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది చిత్రబృందం. అందులో ఒకదానిలో మాట్లాడిన బన్నీ.. తన స్నేహితుల గురించి ఆసక్తికర విషయం చెప్పాడు.

"ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ సెట్​కు వచ్చేవారు. ఇలాంటి స్నేహితులుంటే జీవితంలో ఇంకేమి అక్కర్లేదని అనుకొనేవాడిని. కానీ తర్వాత వారు.. బావా! మేం పూజా కోసం వచ్చాం అని చెప్పేవారు. ఈ మాటతో నేను అవాక్కయ్యా(నవ్వుతూ)" -అల్లు అర్జున్, హీరో

ఈ సినిమాలో సుశాంత్, టబు, నవదీప్, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ABOUT THE AUTHOR

...view details