తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భీష్మ' చిత్రయూనిట్​కు స్టైలిష్​స్టార్​ అభినందనలు - భీష్మ

'భీష్మ' సినిమాపై స్టైలిష్​స్టార్​ అల్లుఅర్జున్ స్పందించాడు. ఆ చిత్ర విజయం పట్ల చిత్రయూనిట్​కు ట్విట్టర్​లో అభినందనలు తెలిపాడు. నితిన్​ పెళ్లికి ముందు ఇలాంటి విజయం వారి కుటుంబంలో సంతోషాన్ని మరింత రెట్టింపు చేసిందన్నాడు.

Allu-Arjun-About-Bheeshma-Movie-Success
'భీష్మ' చిత్రయూనిట్​కు స్టైలిష్​స్టార్​ అభినందనలు

By

Published : Feb 24, 2020, 3:25 PM IST

Updated : Mar 2, 2020, 9:53 AM IST

టాలీవుడ్‌ కథానాయకుడు నితిన్‌ త్వరలో తన స్నేహితురాలు షాలినీని వివాహం చేసుకోనున్నాడు. అతడు హీరోగా నటించిన 'భీష్మ'.. ఫిబ్రవరి 21న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ట్విట్టర్‌లో నితిన్‌ని ఉద్దేశిస్తూ కొన్ని ట్వీట్లు పెట్టాడు. 'భీష్మ' చిత్రబృందానికీ అభినందనలు తెలిపాడు. సరైన సమయంలో నితిన్‌ మంచి విజయం అందుకున్నాడని బన్నీ సంతోషం వ్యక్తం చేశాడు.

"కంగ్రాట్స్‌ నితిన్‌. 'భీష్మ' విజయంతో నీ పెళ్లి వేడుకలు మరింత సందడిగా మారనున్నాయి. సరైన సమయంలో జరిగిన మంచి పని ఇది. నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. 'భీష్మ' చిత్రబృందానికి అభినందనలు. ఓ మంచి ఎమోషనల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను వెంకీ కుడుముల తెరకెక్కించాడు. రష్మిక ఆల్‌ రౌండర్‌. 'భీష్మ' విజయంతో మంచి విజయాన్ని అందుకున్న నిర్మాత వంశీకి అభినందనలు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మీకు మరింత గొప్పగా సాగింది. మొత్తం చిత్రబృందానికి మరోసారి కంగ్రాట్స్‌"

- అల్లుఅర్జున్​, కథానాయకుడు

'భీష్మ' చిత్రయూనిట్​కు స్టైలిష్​స్టార్​ అభినందనలు

జనవరిలో విడుదలైన 'అల..వైకుంఠపురములో' సినిమాతో అల్లుఅర్జున్‌ ఓ మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక సందడి చేయనుంది. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందించనున్నాడు.


ఇదీ చూడండి.. అతడినే పెళ్లి చేసుకుంటా: అనుష్క

Last Updated : Mar 2, 2020, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details