తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బన్నీలో అన్ని కోణాలు చూసి ఆశ్చర్యపోయా' - 'బన్నీలో ఇన్ని కోణాలు చూసి ఆశ్చర్యపోయా'

అల్లు అర్జున్ హీరోగా నటించిన 'అల వైకుంఠపురములో' ఆదివారం విడుదలై మంచి టాక్​ దక్కించుకుంది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

Allu Aravind
బన్నీ

By

Published : Jan 13, 2020, 9:38 AM IST

మాట్లాడుతున్న అల్లు అరవింద్

"రెండు రెళ్లు నాలుగు కాదు ఆరు" అంటున్నారు మెగా నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్. చిత్ర పరిశ్రమలో ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేయడం ఉభయతారకంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణే అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రమని తెలిపిన అరవింద్.. హారికా హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం లాభాన్ని చేకూర్చిందని స్పష్టం చేశారు.

సంక్రాంతి పండక్కి వెళ్లే ప్రజలు కోడి పందాలను ఆస్వాదించినట్లుగానే తమ సినిమాను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అరవింద్. బన్నీ 'రేసుగుర్రం'లో ఒకలా, 'అల వైకుంఠపురములో' మరోలా కనిపించి తనలో ఇన్ని కోణాలున్నాయని ఆశ్చర్యపోయేలా చేశాడని ఆనందం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి.. కృష్ణమాచారి పాత్రలో జీవా.. లుక్​ ఇదిగో

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details