'నటనలో కచ్చితత్వానికి మహేశ్‌బాబు నిదర్శనం' - అల్లరి నరేశ్
'మహర్షి' సినిమాలో రవి పాత్రలో అలరించాడు అల్లరి నరేశ్. నటనలో కచ్చితత్వానికి మహేశ్ నిదర్శనమని పేర్కొన్నాడు. ప్రస్తుతం నాన్న(ఈవీవీ సత్యనారాయణ) ఉండుంటే సంతోషపడేవారని చెప్పాడు నరేశ్.
'నటనలో కచ్చితత్వానికి మహేశ్‌బాబే నిదర్శనం'
'మహర్షి'లో మహేశ్‌బాబుతో నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు అల్లరి నరేశ్. షూటింగ్ సమయంలో సన్నివేశానికి తగినట్లు మహేశ్ ఉండేవారని తెలిపాడు. 'మహర్షి' తనకు గౌరవం ఇచ్చిన చిత్రమంటూ భావోద్వేగంతో మాట్లాడారు.