అల్లరి నరేష్ కథానాయకుడిగా, విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నాంది'. సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి.
అల్లరి నరేష్ 'నాంది' చిత్రీకరణ పూర్తి - విజయ్ కనకమేడల
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న 'నాంది' సినిమా చిత్రీకరణ పూర్తయిందని తెలిపింది చిత్ర యూనిట్. నరేష్ విభిన్న పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నట్లు పేర్కొంది.
అల్లరి నరేష్ 'నాంది' చిత్రీకరణ పూర్తి
అల్లరి నరేష్ ఇప్పటివరకు చేయని ఒక విభిన్నమైన పాత్రని పోషించారని, ఉద్వేగ భరితమైన ఆ పాత్ర, చిత్ర కథ ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటుందని చిత్రవర్గాలు తెలిపాయి. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి సిద్ ఛాయాగ్రాహకుడు.
ఇదీ చదవండి:'నా కష్టాల్ని మరోసారి గుర్తుచేసింది'