కాశ్వీ నాయర్ దర్శకత్వంలో అర్జున్ కపూర్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న సినిమాకు 'సర్దార్ కా గ్రాండ్సన్' టైటిల్ ఖరారు చేశారు. ఈ ఏడాది వేసవిలో ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో జాన్ అబ్రహం, అదితి రావ్ హైదరీ, సోనీ రజ్దాన్, కుముద్ మిశ్రా, దివ్య సేత్ కీలక పాత్రలు పోషించారు.
సప్తగిరి, తాగుబోతు రమేశ్, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన 'హౌస్ అరెస్ట్' టీజర్ విడుదలైంది. కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను శేఖర్ రెడ్డి యెర్రా తెరకెక్కించారు.