తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలీవుడ్​ను టార్గెట్​ చేయడం సరికాదు: అక్షయ్ కుమార్

డ్రగ్స్ కేసులో హిందీ చిత్రపరిశ్రమను లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదని అక్షయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు వీడియోను ట్వీట్ చేశారు.

"All Of Bollywood Not Involved": Akshay Kumar On Drugs Controversy
బాలీవుడ్​ను టార్గెట్​ చేయడం సరికాదు: అక్షయ్ కుమార్

By

Published : Oct 4, 2020, 11:07 AM IST

డ్రగ్స్ కేసులో బాలీవుడ్​ మొత్తాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శించడం సరికాదని ప్రముఖ కథానాయకుడు అక్షయ్ కుమార్ చెప్పారు. 'బెల్​ బాటమ్' షూటింగ్​ను విదేశాల్లో పూర్తి చేసుకుని, ఇటీవలే ముంబయి వచ్చిన ఈయన.. ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాలను చెబుతూ ఓ వీడియోను ట్వీట్ చేశారు.

"మీడియాతో పాటు ప్రజలందరూ బాలీవుడ్​ను లక్ష్యంగా పెట్టుకుని, విమర్శించడం సరికాదు. వ్యతిరేకత ఎక్కువైన ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో తెలియడం లేదు. భారతీయ సంస్కృతి సంప్రదాయలు ప్రతిబింబించేలా మేం(బాలీవుడ్) సినిమాలు తీస్తున్నమనే విషయాన్ని మీడియా, నెటిజన్లు గుర్తించాలి" -అక్షయ్ కుమార్, బాలీవుడ్ హీరో

యువనటుడు సుశాంత్ సింగ్ మృతి తర్వాత డ్రగ్స్ ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ విషయంలో బాలీవుడ్​లోని కొందరు నటీనటులతో పాటు మీడియా, నెటిజన్లు.. ఇండస్ట్రీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

'బెల్ బాటమ్' సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో వాణీ కపూర్, హ్యుమా ఖురేషి హీరోయిన్లుగా నటించారు. రంజిత్ తివారీ దర్శకత్వం వహించారు.

బెల్ బాటమ్ సినిమాలో అక్షయ్ కుమార్

ABOUT THE AUTHOR

...view details