నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ లవబర్డ్స్ రణ్‌బీర్- ఆలియా భట్ మళ్లీ నెట్టింట చర్చనీయాంశంగా మారారు. ఏ వేడుకలో చూసిన వీరిద్దరూ కలిసే హాజరయ్యేవారు. చాలా సన్నిహితంగా కనపడేవారు. రణ్‌బీర్ కటుంబంతో కలిసి ఆలియా తరచూ బయట కనిపిస్తూ ఉండేది. ఈ జంట డిసెంబర్ నెలలో పెళ్లి పీటలెక్కబోతునారన్న వార్తలు సోషల్‌మీడియాలో బాగా ట్రోల్ అయ్యాయి. సరిగ్గా ఇలాంటి జోడి ప్రస్తుతం బ్రేకప్ బాటలో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
మార్చి 15న జరిగిన ఆలియా పుట్టినరోజు వేడుకలో రణ్‌బీర్ హాజరుకాకపోవడం వీటన్నింటికీ బలం చేకురుస్తోంది. కేవలం ఈ భామ మాత్రమే తన స్నేహితులతో కలిసి రెండు కేక్‌లు కట్ చేసి ఉత్సాహంగా గడిపింది. సినీప్రముఖులంతా సామాజిక వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కానీ తన చాక్లెట్ బాయ్ నుంచి మాత్రం ఎటువంటి శుభాకాంక్షలు రాలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఏమైనా వివాదం తలెత్తిందా, లేకపోతే విడిపోయారా? అనే అనుమానాలు రేకేత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఇదీ చూడండి: ఆ హీరో రెడ్ హ్యాండెండ్‌గా దొరికాడు.. అందుకే వదిలేశా!