డాక్టర్బాబుగా ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్నారు బుల్లితెర నటుడు నిరుపమ్. ఆయన భార్య మంజులతో కలిసి ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'ఆలీతో సరదాగా'కు అతిథులుగా విచ్చేసి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా తనకు హాస్యనటుడు బ్రహ్మానందం అభినందించేందుకు కాల్ చేస్తే కట్ చేసినట్లు గుర్తుచేసుకున్నారు నిరుపమ్.
బ్రహ్మానందం కాల్ చేస్తే కట్ చేశా: నిరుపమ్
ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'ఆలీతో సరదాగా'కు ఈ వారం బుల్లితెర జోడీ నిరుపమ్, మంజుల విచ్చేసి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా హాస్యనటుడు బ్రహ్మానందం అప్పుడప్పుడు కాల్ చేసి అభినందిస్తుంటారని చెప్పారు నిరుపమ్. మెచ్చుకునేందుకు బ్రహ్మీ తొలిసారి ఫోన్ చేసినప్పుడు ఆయన అని తెలియక కాల్ కట్ చేసినట్లు గుర్తుచేసుకున్నారు.
'లేడీస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది కదా ఇప్పటికీ లెటర్స్, కాల్స్ వస్తాయా' అని అలీ అడగా.. వస్తుంటాయని నిరుపమ్ బదులిచ్చారు. "తెలియనివాళ్లు ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని ఫోన్ పెట్టేస్తుంటా. అలానే ఓసారి బ్రహ్మానందం గారూ కాల్ చేస్తే.. ఎవరో అనుకుని పెట్టేశాను. ట్రూ కాలర్లో చూస్తే ఆయన అని తెలిసింది. తిరిగి చేయాలా వద్దా, ఏమని చెప్పాలి అని సందిగ్ధంలో పడిపోయా. అంతలో వేరే నంబర్ నుంచి ఆయనే మళ్లీ కాల్ చేశారు. సారీ చెప్పాను. పర్వాలేదు అని అని చెప్పి నా పాత్ర, సీరియల్ గురించి అభినందించారు. అలా అప్పటి నుంచి సీరియల్ చూసినప్పుడల్లా రెగ్యులర్గా కాల్ చేసి మెచ్చుకుంటుంటారు. తప్పుఒప్పులు చెప్తారు" అని వెల్లడించారు నిరుపమ్.