Alitho saradaga Actor Vinodkumar: 'మౌనపోరాటం', 'మామగారు', 'సీతారత్నంగారి అబ్బాయి' వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు వినోద్ కుమార్.. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. కెరీర్ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. పలు సినిమాల్లో విలన్‌గా నటించిన సత్యప్రకాశ్ కూడా ఈ షోలో కాసేపు సందడి చేశారు.
'కర్తవ్యం' సినిమా సమయంలో నటుడు సాయికుమార్‌తో పరిచయం ఏర్పడినట్లు గుర్తుచేసుకున్న వినోద్... తనకు డబ్బింగ్ చెప్పని కారణంగా అప్పుడు సాయికుమార్‌ను కొట్టాలనుకున్నట్లు(నవ్వుతూ) చెప్పారు.