తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆయన నన్ను ఘోరంగా అవమానించారు: సినీ నటుడు సత్య - ఆలీతో సరదాగా లేటెస్ట్ ఎపిసోడ్​

Alithosaradaga Actor Satyaprakash: ఓ సినిమా షూటింగ్‌లో కో-డైరెక్టర్‌ తనను ఘోరంగా అవమానించారని, అనరాని మాటలు అన్నారని గుర్తుచేసుకున్నారు సినీ నటుడు సత్యప్రకాశ్​. తన కెరీర్​ గురించి పలు విషయాలను తెలిపారు.

Alithosaradaga Actor Satyaprakash
Alithosaradaga Actor Satyaprakash

By

Published : Mar 9, 2022, 9:39 AM IST

Alithosaradaga Actor Satyaprakash: తానేదో పిచ్చి పనులు చేస్తుంటే ఎవరో డైరెక్టర్‌ పిలిచి వేషం ఇచ్చారని, ఆ తర్వాత తనకు అవకాశం ఇచ్చినందుకు ఆ దర్శకుడు ఇప్పటికీ బాధపడుతున్నారని చెప్పారు సినీ నటుడు సత్యప్రకాశ్​. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతినాయకుడిగా ఎన్నో చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన ఆయన తాజాగా ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులను తెలిపారు.

'నో పెయిన్‌.. నో గెయిన్‌.. అది మారిస్తే నో గెయిన్‌ విత్‌ అవుట్‌ పెయిన్‌' అన్నారు సత్యప్రకాశ్​. తాను పుట్టింది విజయనగరంలో అని, పెరిగిందంతా ఒడిశాలో అని సత్యప్రకాశ్‌ చెప్పుకొచ్చారు. కొన్ని రోజులు బ్యాంకులో కూడా ఉద్యోగం చేసినట్లు తెలిపారు. ఒక సినిమా షూటింగ్‌ సందర్భంగా కో-డైరెక్టర్‌ అనరాని మాటలు అన్నారని వాపోయారు. దీనికి సంబంధించిన ప్రోమోను చూసేయండి..

ఇదీ చూడండి: గుండెజారి గల్లంతయ్యిందే.. నీ సొగసే చూసి..

ABOUT THE AUTHOR

...view details