ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమం 'ఆలీతో సరదాగా'(Alitho saradaga latest episode). సినీ ప్రముఖుల ఇంటర్వ్యూతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించే ఈ షో 250వ ఎపిసోడ్‌కు చేరుకుంది. ఎంతో ప్రత్యేకమైన ఈ ఎపిసోడ్‌లో ప్రముఖ నటుడు మోహన్‌బాబు సందడి చేయనున్నారు. దానికి సంబంధించిన ప్రోమో(alitho saradaga latest promo) తాజాగా విడుదలైంది.
'ఆలీతో సరదాగా'.. మోహన్ బాబు ఎంట్రీ అదిరిందిగా - Alitho saradaga Mohanbabu
ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(Alitho saradaga latest episode) కార్యక్రమానికి సీనియర్ నటుడు మోహన్‌బాబు(Mohanbabu movies) అతిథిగా విచ్చేసి పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. ఈ షోలో మోహన్‌బాబు ఎంట్రీ అదిరింది. దీనికిి సంబంధించిన ప్రోమోను చూసేయండి..
'విలన్‌గా 400కిపైగా చిత్రాలు, హీరోగా 150కిపైగా చిత్రాలు, నిర్మాతగా 60కిపైగా చిత్రాలు, విద్యావేత్తగా కీర్తి ప్రతిష్ఠలు, రాజకీయవేత్త, టాలీవుడ్ కలెక్షన్ కింగ్' అంటూ మోహన్ బాబు(mohan babu movies) ఎంట్రీని చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. 'ఆలీతో సరదాగా'.. అతి త్వరలో .. ఈటీవీలో' అని మోహన్ బాబు తనదైన శైలిలో చెప్పి, విశేషంగా అలరిస్తున్నారు. మరి ఆయన పంచుకున్న ఆ సరదా సంగతులేంటో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి...
ఇదీ చూడండి: ఫోర్జరీ సంతకంతో దొరికిపోయిన అవసరాల శ్రీనివాస్!