ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో 'చావుకబురు చల్లగా' హీరోహీరోయిన్లు కార్తికేయ, లావణ్య త్రిపాఠి హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆలీ, వారికి మధ్య సాగిన సరదా సంభాషణ ప్రేక్షకులను అలరిస్తోంది.
'చావుకబురు చల్లగా' సినిమాలో పెళ్లైన అమ్మాయికి(లావణ్య త్రిపాఠి) ప్రపోజ్ చేస్తాడు కార్తికేయ. 'నిజజీవితంలో కూడా పెళ్లైన అమ్మాయికి ప్రపోజ్ చేశావా' అని ఆలీ అడగగా లేదని కార్తికేయ సమాధానమివ్వడం నవ్వులు పూయిస్తోంది. అయితే కాలేజీ రోజుల్లో తన క్లాస్‌మేట్‌తో ప్రేమాయాణం సాగించినట్లు కానీ సినిమాల్లోకి రాకముందే అది బ్రేకప్ అయినట్లు తెలిపాడు కార్తికేయ. తర్వాత.. హీరో కాకముందు దర్శకుడు పూరీజగన్నాథ్‌ను కలిసిన సంఘటనను గుర్తుచేసుకున్నాడీ హీరో. 'జ్యోతిలక్ష్మి' షూటింగ్ సెట్‌కు పూరీని కలవడానికి వెళ్తే తొలుత అక్కడి బౌన్సర్లు తనను బయటకు నెట్టేశారని, కానీ ఆ తర్వాత పూరీనే తనను పిలిచి మాట్లాడారని చెప్పాడు. తామిద్దరి మధ్య సాగిన సంభాషణల గురించి వివరించాడు. ఆయనతో సినిమా చేయడం తన డ్రీమ్ అని మనసులోని మాటను బయటపెట్టాడు.