Alitho Saradaga Latest Episode: రాజశేఖర్ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కిస్తున్న చిత్రం 'శేఖర్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన జీవితా రాజశేఖర్ దంపతులు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. డైలాగ్ కింగ్ మోహన్‌బాబుతో కలిసి ఎందుకు సినిమా చేయలేదో వివరించారు.
'హనుమన్ జంక్షన్' సినిమాకు మోహన్‌బాబు, రాజశేఖర్ కాంబినేషన్ ఎందుకు మిస్సైంది?
"ఎందుకు కుదరలేదంటే.. వారేమో కచ్చితంగా టైమ్ అంటే టైమ్‌కి వస్తారు. నేను 9 గంటలకు రమ్మంటే 10 గంటలకు వెళ్తాను. అదే విషయాన్ని ఎడిటర్ మోహన్, మోహన్ బాబుగారికి చెప్పాను. 'ఇది మన మధ్య అపార్థాలకు దారి తీస్తుంది. ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి చేయకుండా ఉంటే బాగుంటుంది' అని ఎడిటర్ మోహన్, మోహన్‌బాబుకు చెప్పి వద్దనుకున్నాం. అంతకు మించి వేరే ఏం లేదు" అని రాజశేఖర్ చెప్పారు.