Kritishetty Alitho saradaga: 'ఉప్పెన' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది కృతిశెట్టి. 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆమె సంక్రాంతికి 'బంగార్రాజు'తో సందడి చేయనుంది. నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కల్యాణ్‌కృష్ణ తెరకెక్కించిన సినిమా ఇది. దీనికి సంబంధించిన విశేషాలు పంచుకునేందుకు కృతిశెట్టి, కల్యాణ్‌కృష్ణ 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేశారు. ఆలీ అడిగిన ప్రశ్నలకు సరదా సమాధానాలిచ్చి హాయిగా నవ్వించింది.
ఆ నటుడంటే చాలా బాగా ఇష్టం: కృతిశెట్టి - కృతిశెట్టి బంగార్రాజు
Kritishetty Alitho saradaga: 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి.. ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి పలు ఆసక్తికర సంగతులను తెలిపింది. ఇందులో భాగంగా ఆమె నటించిన కొత్త సినిమా 'బంగార్రాజు' చిత్ర విశేషాలను వెల్లడించింది. హాస్యనటుడు బ్రహ్మానందం అంటే తనకు బాగా ఇష్టమని పేర్కొంది.
ఆలీ తనను ముద్దు పేరుతో వేదికపైకి ఆహ్వానించటం వల్ల కృతిశెట్టి సర్‌ప్రైజ్ అయింది. 'ఇది దర్శకుడు కల్యాణ్‌కృష్ణకు కూడా తెలియదు మీకెలా తెలుసు' అని ఆలీని ప్రశ్నించింది. 'మీకెప్పుడూ చెప్పలేదా' అని ఆలీ కల్యాణ్‌ను అడిగ్గా ఆమెకు ఇంకా చాలా పేర్లు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో.. ఆయన కె.కె. (కల్యాణ్‌కృష్ణ), నేనూ కె.కె. (కృతికృష్ణ) అని కృతిశెట్టి చెప్పుకొచ్చింది. ఇంతందంగా పుట్టేందుకు మీ ఊర్లో ఏమైనా అమ్ముతారా? అంటూ ఆలీ అడగ్గా 'అవును నీళ్లలో ఏదో ఉంది' అంటూ కృతి నవ్వులు కురిపించింది. సినిమాల్లోకి రాకముందు పలు కంపెనీలకు సంబంధించిన ప్రకటనల్లో నటించానని, 'ఉప్పెన' విజయం తర్వాత ఓ ప్రముఖ నటుడు తనను ప్రశంసిస్తూ ఓ లేఖ రాశారని తెలిపింది. తనకు బ్రహ్మానందం అంటే బాగా ఇష్టమని చెప్పింది. 'బంగార్రాజు'లోని తన పాత్రకు సంబంధించిన ఓ డైలాగ్ చెప్పి అలరించింది. మధ్యమధ్యలో కల్యాణ్‌కృష్ణ పంచ్‌లు కడుపుబ్బా నవ్వించాయి.