హీరో ప్రభాస్, హీరోయిన్ ఆలియా భట్ తలపడటానికి సిద్ధమయ్యారు. అదేంటి వీరిద్దరు కలిసి ఏదైనా సినిమా చేస్తున్నారా అని అనుకుంటారేమో. కాదు.. బాక్సాఫీస్ యుద్ధానికి సమాయత్తమయ్యారు.
గ్యాంగ్‌స్టర్ గంగూబాయ్ కొతేల్‌వాలి జీవిత కథతో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రం 'గంగూబాయి కతియావాడి'. టైటిల్ పాత్రలో బాలీవుడ్ నాయిక ఆలియా భట్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాను ఈ ఏడాది జులై 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అయితే ఇదే రోజున రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ నటిస్తున్న 'రాధేశ్యామ్' సినిమా కూడా విడుదల కానుంది. దీంతో ఇరు సినిమాల మధ్య గట్టిపోటీ నెలకొననుంది. మరి ఈ రెండింటిలో అత్యధిక వసూళ్ళను ఏ సినిమా అందుకుంటుందో చూడాలి మరి.
అయితే ఈ రెండు సినిమాలే కాకుండా మరికొన్ని చిత్రాలు కూడా ఈ ఏడాది ఒకే రోజున విడుదలకు సిద్ధమయ్యాయి.
ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' ఈ ఏడాది ఈద్‌కు థియేటర్లలోకి రానుండగా.. మరోవైపు మిలాప్ జవేరీ డైరెక్షన్లో జాన్ అబ్రహాం నటించిన 'సత్యమేవ జయతే 2' మే 12న రిలీజ్ కానుంది.