గ్యాంగ్‌స్టర్ గంగూబాయి కొతేల్‌వాలి జీవిత కథతో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రం 'గంగూబాయి కతియావాడి'. టైటిల్ పాత్రలో బాలీవుడ్ నాయిక ఆలియా భట్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాను ఈ ఏడాది జులై 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. దీంతో పాటు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసిన మూవీ టీం.. టీజర్‌ను నేడు విడుదల చేస్తామని తెలిపింది.
'ప్రేమమ్' ఫేం నవిన్ పౌలీ.. అబ్రిడ్ షైన్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రానికి 'మహా వీర్యార్' అనే టైటిల్‌ను ప్రకటించారు. తొలి షెడ్యూల్‌ను రాజస్థాన్‌లో చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను పంచుకుంది చిత్రబృందం.
'అలాంటి సిత్రాలు' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్. యశ్పూరి, శ్వేతా పరాషార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సుప్రిత్ సి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.