కోలీవుడ్ స్టార్ హీరో సూర్య-దర్శకుడు టి.ఎస్.జ్ఞానవేల్ కలయికలో తెరకెక్కిన సినిమా 'జైభీమ్'(surya jai bhim movie). అమెజాన్ ప్రైమ్‌లో ఇటీవలే విడుదలైన ఈ మూవీ విశేష ప్రేక్షకాదరణ పొందింది(surya jai bhim movie release date). ఇప్పుడీ ఈ చిత్రం ఓ రికార్డును అందుకుంది. ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ సినిమాల జాబితాలో అత్యధిక రేటింగ్ 9.6 సాధించి టాప్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఏ తప్పు చేయని బలహీన వర్గ మహిళను కేసు నుంచి బయటపడేసే లాయర్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు సూర్య. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ మూవీని నిర్మించారు.
కొత్త రిలీజ్ డేట్
ఆలియా భట్(gangubai kathiawadi movie) హీరోయిన్గా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం 'గంగూబాయ్ కతియావాడి'. వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది చిత్రబృందం(gangubai kathiawadi release date). ఇప్పటికే విడుదల ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
టీజర్‌తో
యోధుడు పృథ్వీరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 'పృథ్వీరాజ్'. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ టైటిల్ రోల్ పోషించారు. మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ కథానాయిక. తాజాగా ఈ చిత్ర టీజర్(akshay kumar prithviraj teaser) విడుదలై ఆకట్టుకుంది. సినిమాను వచ్చే ఏడాది జనవరి 21న రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం(akshay kumar prithviraj release date).ఈ మూవీకి చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకుడు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.
సాంగ్‌తో రాజ్‌తరుణ్