తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రిలీజ్​ డేట్​తో 'గంగూబాయ్​', 'మైదాన్​'.. ఆసక్తిగా 'నల్లమల' టీజర్​ - సర్దార్​ ఉద్దమ్​ ట్రైలర్​

కొత్త చిత్రాల అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'ఇదే మా కథ', 'సర్దార్​ ఉద్దమ్'​ ట్రైలర్స్​​, 'నల్లమల' టీజర్​ సహా ఆలియా భట్​ 'గంగూబాయ్'​, అజయ్​దేవగణ్​ 'మైదాన్'​ రిలీజ్​ డేట్​ వివరాలు ఉన్నాయి.

cinema updates
సినిమా అప్డేట్స్​

By

Published : Sep 30, 2021, 3:24 PM IST

'విక్రమార్కుడు', 'లక్ష్యం' వంటి చిత్రాల్లో(nallamala movie teaser) నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్స్‌ పోషించి సహాయనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు అమిత్‌ తివారి. ఆయన కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం 'నల్లమల'(nallamala movie cast). భానుశ్రీ కథానాయిక. రవిచరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 'నల్లమల' టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

'1980లో ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధం మొదలయ్యే ముందు రోజు అది. అప్పుడప్పుడే నల్లమల అడవుల్లో అంతర్యుద్ధం మొదలైంది' అనే మాటలతో ప్రారంభమైన టీజర్‌ ఆసక్తిగా ఉంది. ప్రతి సన్నివేశంలో అమిత్‌ నటన ఆకట్టుకునేలా ఉంది. అధికారం కోసం నల్లమల అటవీ ప్రాంతంలో చోటుచేసుకునే సంఘటనలు.. అందమైన అడవిలో స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. నాజర్‌, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్‌, కాళకేయ ప్రభాకర్‌.. తదితరులు కీలకపాత్రలు పోషించారు. మరోవైపు, ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన 'ఏమున్నవే పిల్ల.. ఏమున్నవే' పాట విశేష ప్రేక్షకాధరణ సొంతం చేసుకుంది.

ఇదే మా కథ

గురు పవన్(ide ma kadha movie)​ దర్శకత్వంలో శ్రీకాంత్​, సుమంత్​ అశ్విన్​, భూమికా చావ్లా, తాన్య హోప్​ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇదే మా కథ'(idhe maa katha trailer). నేడు(సెప్టెంబరు 30) ఈ చిత్ర ట్రైలర్​ను దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ విడుదల చేశారు.

'సర్దార్​ ఉద్దమ్'​ ట్రైలర్​

విక్కీ కౌశల్‌ కీలక పాత్రలో(vicky kaushal new movie) సూజిత్‌ సిర్కార్‌ దర్శకత్వం వహిస్తున్న హిస్టారికల్‌ డ్రామా 'సర్దార్ ఉద్దమ్‌'(sardar udham amazon). చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అక్టోబరు 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్​ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

1919 జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. జలియన్‌ వాలాబాగ్‌లో సమావేశమైన స్వాతంత్య్ర సమరయోధులపై బ్రిటిష్ అధికారి, జనరల్ డయ్యర్‌ తన సైన్యంతో వచ్చి, తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో మొత్తం వెయ్యికు పైగా భారతీయులు మృత్యువాతపడ్డారు. భారతదేశ చరిత్రలో అదొక చీకటిదినంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. వందల మంది మృతికి కారణమైన జనరల్‌ డయ్యర్‌ను విప్లవకారుడైన ఉద్దమ్‌ సింగ్‌ కాల్చి చంపాడు. అనంతరం ఉరిశిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఈ కథతోనే విక్కీ-సూజిత్‌ సిర్కార్‌లు 'సర్దార్‌ ఉద్దమ్‌'(sardar udham release date) తెరకెక్కించారు.

'గంగూబాయ్'​ రిలీజ్​ డేట్​

ఆలియా భట్(gangubai kathiawadi trailer) హీరోయిన్​గా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం 'గంగూబాయ్ కతియావాడి'(gangubai kathiawadi release date). గురువారం(సెప్టెంబరు 30) ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. వచ్చే ఏడాది జనవరి 6 థియేటర్లలో రిలీజ్​ కానున్నట్లు తెలిపింది. ఇప్పటికే విడుదల ఈ చిత్ర ట్రైలర్​ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

గంగూబాయ్​

అజయ్​దేవగణ్​ 'మైదాన్​'

బాలీవుడ్​ స్టార్​(maidaan release date) అజయ్​దేవగణ్​ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మైదాన్'​. ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్​ 3 రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుందీ చిత్రం. స‌య్య‌ద్​ అబ్ధుల్ ర‌హీం జీవితాధారంగా 'మైదాన్'ను తెరకెక్కిస్తున్నారు. 1952 నుంచి 1963 మధ్య కాలంలో ఫుట్‌బాల్‌ క్రీడలో ప్రపంచ దేశాలపై అద్భుత ఆధిపత్యం ప్రదిర్శించింది భార‌త్. ఆ స‌మ‌యంలో ఆ జ‌ట్టుకు కోచ్‌గా వ్యవహరించారు రహీం. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్​, జీ స్టూడియోస్‌ నిర్మాణ సంస్థ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. అజయ్‌ దేవగణ్‌తో(ajay devgan new movie 2021) పాటు ప్రియమణి, గజ్​రాజ్​ నటిస్తున్నారు. అమిత్‌ రవీందర్‌నాథ్‌ దర్శకుడు.

మైదాన్​

ఇదీ చూడండి: మత్తెక్కించే అయేషా శర్మ అందాలు..

ABOUT THE AUTHOR

...view details