బాలీవుడ్ చిత్రం 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్- 2'లోని హుక్ అప్ సాంగ్ ప్రేక్షకులని అలరిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే దాదాపు రెండు కోట్ల మంది ఈ పాటను వీక్షించారు. టైగర్ ష్రాఫ్, ఆలియా భట్ నర్తించిన ఈ పాట సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇందులో ఆలియా ప్రత్యేక గీతంలో మెరిసింది.
ఆలియా భట్, టైగర్ ష్రాఫ్ 'హుక్ అప్'...! - alia
'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2' సినిమాలోని హుక్ అప్ సాంగ్ సినీప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టైగర్ ష్రాఫ్, ఆలియా భట్ నటించిన ఈ పాటను రెండు రోజుల్లోనే దాదాపు రెండు కోట్ల మంది వీక్షించారు.
హుక్ అప్
కరణ్‌జోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నాడు. టైగర్ ష్రాఫ్ సరసన తారా సుతారియా, అనన్య పాండ్య నటిస్తున్నారు. ఈ చిత్రం మే 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
2012లో వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' చిత్రానికి సీక్వెల్‌గా రాబోతుంది ఈ చిత్రం. కరణ్‌జోహర్ దర్శకత్వంలో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రంతోనే బాలీవుడ్ తెరకు పరిచయమయ్యారు అలియా.
Last Updated : May 2, 2019, 1:46 PM IST