తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నేను కంగనలా కాదు:అలియా - రణ్‌బీర్ కపూర్

బాలీవుడ్ క్వీన్ కంగన పుల్వామా, సర్జికల్ స్ట్రయిక్స్, అభినందన్ అంశాలపై స్పందించలేదంటూ... రణ్‌బీర్ కపూర్, అలియాభట్‌ లపై మండిపడింది. క్వీన్​ వ్యాఖ్యలపై తాజాగా ఆలియా సమాధానమిచ్చింది.

నేను కంగనలా కాదు:అలియా

By

Published : Mar 7, 2019, 7:47 PM IST

రాజకీయ అంశాలపై మాట్లాడటం గురించి కంగనారనౌత్ చేసిన​ వ్యాఖ్యలపై 'ఔట్​ లుక్​ ఉమెన్​ ఆఫ్​ వర్త్​' కార్యక్రమంలో బదులిచ్చింది అలియా భట్​.

'కంగన మాట్లాడినంత ఘాటుగా నేను మాట్లాడలేను. కంగన ఏ విషయంపై అయినా బాగా స్పందిస్తుంది. ఆమె ప్రశ్నించిన మాటల్లో తప్పేమీ కనిపించలేదు. మాలోనే అలాంటి ఆలోచనా తీరు లేదు. ఇలాంటి విషయాల్లో నాకంటూ ఓ ఆలోచన ఉన్నా అది నాలోనే దాచుకొంటా. కంగనలా నేను బయటకు చెప్పలేను'.
-అలియా భట్​, నటి

అలియా నటిగానే కాకుండా ఇటీవలే నిర్మాతగానూ మారింది. 'ఎటర్నల్​ సన్​షైన్​ ప్రొడక్షన్స్'​ పేరుతో బ్యానర్​నూ ఏర్పాటు చేసింది.

'నటనంటే నాకు చాలా ఇష్టం. నా జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి. సినిమాల నిర్మాణం సహా సామాజిక సమస్యలపైనా దృష్టి పెట్టాల్సి ఉంది. కానీ ఈ విషయాల్లో నాకు పెద్దగా అనుభవం లేదు. నేనింగా సమాజం గురించి నేర్చుకునే దశలోనే ఉన్నాను' అంటూ మాట్లాడింది అలియా.

త్వరలో బ్రహ్మస్త, కళంక్​ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది అందాలభామ అలియా.

  • అసలేం జరిగింది:

దేశంలో తాజాగా చోటుచేసుకున్న పరిస్థితుల గురించి రణ్‌బీర్ కపూర్, అలియాభట్ గతంలో స్పందిస్తూ... "మేమెందుకు రాజకీయాల్లో తలదూర్చాలి, వాటి గురించి ఎందుకు మాట్లాడాలి. మనం దేశానికి ఏమీ చేయనప్పుడు చర్చించాల్సిన అవసరం ఏముంది. నా ఇంట్లో కరెంట్, వాటర్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని విషయాలపై మన ప్రమేయం లేనప్పుడు వాటికి ఎందుకు బాధ్యత వహించాలి" అని అన్నారు. రణబీర్, అలియా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది కంగన.

  • నీ ఇంట్లో అన్నీ ఉన్నాయంటే.. అవి దేశం మీకు ఇచ్చింది. నీవు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నావంటే, మెర్సిడెజ్ కారులో తిరుగుతున్నావంటే అది ప్రజలు పెట్టిన భిక్ష. దేశం లేకుంటే నీవు లేవన్నది గుర్తుంచుకోవాలి. ఈ దేశ పౌరుల డబ్బుతోనే నీ జీవితం ముడిపడి ఉంది. అలా మాట్లాడటం బాధ్యతారాహిత్యం అని కంగన మండిపడింది.

ABOUT THE AUTHOR

...view details