బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో సామాజిక మాధ్యమాల వేదికగా బంధుప్రీతి చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్లు కంగనా రనౌత్, ఆలియా భట్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా, తనను లక్ష్యంగా చేసుకొని కంగన చేసిన వ్యాఖ్యలకు.. ఎవరిపేరు ప్రస్థావించకుండా ధీటుగా బదులిచ్చింది ఆలియా. నిజాలు, అబద్దాల మధ్య తేడా గురించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.
"ఎవ్వరు నమ్మకపోయినా నిజం ఎప్పటికీ నిజమే. అందరూ నమ్మినా అబద్దం ఎల్లప్పుడూ అబద్దమే" అనే సారాంశంతో ఓ పోస్ట్ పెట్టింది.