బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల మార్చి 15న పుట్టినరోజు వేడుకలు తన స్నేహితులతో కలిసి ఉత్సాహంగా చేసుకుంది ఆలియా. అయితే ఆ వేడుకలో ప్రియుడు రణ్‌బీర్ కనపడలేదు. సామాజిక మాధ్యమాల్లో సినీ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలిపినప్పటికీ చాక్లెట్ బాయ్ విషెష్ చెప్పలేదు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఏమైనా వివాదం తలెత్తిందా? బ్రేకప్ చెప్పుకున్నారా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ అనుమానలన్నింటికీ చెక్ పెట్టింది ఆలియా.
ఇంటర్వ్యూలో ఓ రిపోర్టర్ ఈ పుకార్లపై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించగా.. నవ్వుతూ తనదైన శైలిలో స్పందించింది ఆలియా. అవన్నీ చెత్త పుకార్లని కొట్టిపారేసింది. రణ్‌బీర్.. ఈ మధ్యే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న తన తండ్రి బాలీవుడ్ సినీయర్ నటుడు రిషికపూర్ తల్లి నీతూ సింగ్‌తో కలిసి గడుపుతున్నాడని తెలిపింది. అలా ఈ రూమర్స్‌కు తెరదించింది.