తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గంగూబాయ్​' పాత్రలో మెప్పిస్తోన్న ఆలియా - గంగూభాయ్​ పాత్రలో మెప్పిస్తోన్న ఆలియా

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న చిత్రం 'గంగూబాయ్'. ఆలియా భట్ హీరోయిన్​గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Alia Bhatts
ఆలియా భట్

By

Published : Jan 15, 2020, 3:33 PM IST

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ మరోసారి భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ముంబయికి చెందిన రౌడీ రాణి గంగూబాయ్‌ కతియావాడి జీవితాధారంగా 'గంగూబాయ్‌' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ముద్దుగుమ్మ ఆలియా భట్‌ హీరోయిన్​గా చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

ఆలియా భట్

ఆలియా విభిన్నంగా.. ప్రేక్షకులు గుర్తుపట్టలేని విధంగా కనపించి ఆక్టటుకుంది. "బలం, అధికారం, భయం.. ఒక్క చూపు... వేల భావోద్వేగాలు.." అంటూ భన్సాలీ ప్రొడక్షన్స్‌ ఈ ఫస్ట్‌లుక్స్‌ను సోషల్‌మీడియాలో పంచుకుంది. ఆలియా లుక్‌కు నెటిజన్ల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి.

ఆలియా భట్

ముంబయిలోని కామాటిపుర ప్రాంతానికి చెందిన గంగూబాయ్‌ అంటే అక్కడివారు వణికిపోయేవారట. ఆమెను 'మేడమ్‌ ఆఫ్‌ కామాటిపుర'గా పిలిచేవారు. చిన్నతనంలోనే ఇంట్లోని వారు బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించిన కారణంగా ఆమె చాలాకాలం పాటు అదే వృత్తిలో కొనసాగారు, రౌడీరాణిగా ఎదిగారు. ఇప్పుడు 'గంగూబాయ్‌' సినిమాలో గంగూబాయ్‌ జీవితం, ముంబయిలో ఆమె నడిపిన వ్యభిచార గృహాల గురించి చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి.. ఆత్రేయపురంలో 'గోపీచంద్‌ 28' చిత్రీకరణ..!

ABOUT THE AUTHOR

...view details