తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒక్క పాట కోసం రూ.3 కోట్ల బడ్జెట్​!

దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోన్న 'ఆర్​ఆర్​ఆర్​'(RRR)..​ రెండు పాటలు మినహా షూటింగ్​ పూర్తయ్యింది. ఇందులో ఓ పాట కోసం దాదాపుగా రూ.3 కోట్లు ఖర్చు చేయనున్నట్లు టాలీవుడ్​లో టాక్​ నడుస్తోంది. ఆ పాటలో బాలీవుడ్​ నటి అలియా భట్​ పాల్గొంటుందని తెలుస్తోంది.

Alia Bhatt To Star In Rs 3 Crore Song Sequence In RRR
ఒక్క పాట కోసం రూ.3 కోట్ల బడ్జెట్​!

By

Published : Jul 16, 2021, 8:51 AM IST

Updated : Jul 16, 2021, 11:46 AM IST

కేవలం ఒక్క పాట కోసం రూ.3 కోట్ల బడ్జెట్‌ వెచ్చించడం అంటే ఆశ్చర్యపరిచే విషయమే. కానీ.. దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) సినిమాలో ఆ వార్త పెద్ద మేటర్‌ కానే కాదు. తాను అనుకున్నట్లుగా సినిమాను మలిచేందుకు జక్కన్న ఎక్కడా వెనక్కి తగ్గరు. ఆయనకు తగ్గట్లుగానే నిర్మాతలు సైతం ఎంత బడ్జెట్‌ పెట్టేందుకైనా సిద్ధంగా ఉంటారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.. మళ్లీ ఎందుకు ఈ చర్చంతా అనుకుంటున్నారా..?

రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో(RRR) ఓ పాట ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక పాట రూపుదిద్దుకోనుంది. కేవలం ఒక్క పాట కోసం ఏకంగా రూ.3కోట్లు వెచ్చించనున్నారట. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆ సాంగ్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం. అందులో బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా కాస్ట్యూమ్స్‌ కోసం దాదాపు రూ.కోటి వరకు ఖర్చు చేయనున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.

ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌(Ramcharan) కథానాయకులుగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'(రణం రౌద్రం రుధిరం) గతంలో ప్రకటించిన తేదీకే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం విడుదల చేసిన 'రోర్​ ఆఫ్​ ఆర్ఆర్ఆర్' మేకింగ్​ వీడియోలోనూ(Roar of RRR) సినిమా రిలీజ్​ డేట్​ను అక్టోబర్‌ 13, 2021గా చిత్రబృందం పేర్కొంది. ఇప్పటికే రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. అలియా భట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న కథతో రూపొందుతున్న చిత్రమిది. అల్లూరిగా రామ్‌చరణ్‌ నటిస్తుండగా.. భీమ్‌ పాత్రను ఎన్టీఆర్‌ పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత.

ఇదీ చూడండి..Roar of RRR: మేకింగ్​ వీడియో కుమ్మేసింది బాసూ!

Last Updated : Jul 16, 2021, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details