తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Alia Bhatt: ఆలియా హాలీవుడ్​ ఎంట్రీ.. ఈ సినిమాతోనే.. - brahmastra

Alia Bhatt: త్వరలోనే హాలీవుడ్​ తెరపై కనువిందు చేయనుంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. ఇప్పటికే పాన్​ఇండియా సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. నెట్​ఫ్లిక్స్​ అంతర్జాతీయ స్పై థ్రిల్లర్​ 'హార్ట్​ ఆఫ్​ స్టోన్'​లో నటించనుంది.

alia bhatt
ఆలియా భట్

By

Published : Mar 8, 2022, 10:11 AM IST

Alia Bhatt: స్టార్​ హీరోయిన్​గా వెలుగొందుతున్న బాలీవుడ్ భామ ఆలియా భట్​.. హాలీవుడ్​ ఎంట్రీ ఖరారైపోయింది. 'హార్ట్​ ఆఫ్ స్టోన్'​ అనే అంతర్జాతీయ స్పై థ్రిల్లర్​లో నటించనుంది ఆలియా. దీనిని నెట్​ఫ్లిక్స్​ తీసుకురానుంది.

ఆలియా

ఈ చిత్రంలో హాలీవుడ్​ సూపర్​స్టార్లు గాల్​ గాడట్​, జేమీ డోర్నన్​ సరసన నటించనుంది ఆలియా. దీనికి బ్రిటిష్ ఫిల్మ్​మేకర్​ టామ్​​ హార్పర్​ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

'గంగూబాయి కతియావాడి'లో ఆలియా

ఆలియా ప్రధానపాత్రలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'గంగూబాయి కతియావాడి' ఇటీవలే థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంటోంది. అందులో ఆలియా నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇక దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్​ఆర్​ఆర్'​లోనూ మెరవనుంది ఆలియా. ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ఆలియా భట్

ప్రస్తుతం తన బాయ్​ఫ్రెండ్​ రణ్​​బీర్​ కపూర్​తో కలిసి 'బ్రహ్మాస్త్ర'లో నటిస్తోంది ఆలియా. ఇందులో బిగ్​బీ అమితాబ్​ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2022 సెప్టెంబర్​ 9న విడుదలకానుంది.

ఇదీ చూడండి:మహేశ్​బాబు- రాజమౌళి చిత్రంలో ఆలియాభట్​..!

ABOUT THE AUTHOR

...view details