'ఆర్ఆర్ఆర్' గురించే ప్రస్తుతం ఎక్కడచూసినా చర్చ! సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్పీడ్‌గా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే 'జనని' సాంగ్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. సినిమాలోని పాత్రలన్నీ ఈ గీతంలో దాదాపుగా చూపించేశారు. అయితే హీరోయిన్ ఆలియా భట్‌కు సంబంధించిన ఓ విషయం తెగ ఆసక్తి కలిగిస్తోంది.
టీజర్, 'జనని' పాటలో ఒక్కో షాట్లో మాత్రమే ఆలియా కనిపించింది. దీంతో సినిమా మొత్తంలో ఆమె పాత్ర చాలా తక్కువ వ్యవధే ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. అది కూడా దాదాపు 15 నిమిషాలే అని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.
'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ డిసెంబరు తొలి వారంలో రిలీజ్ చేస్తామని.. ఈ నెల మొత్తం ప్రచారంలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భారీస్థాయిలో జరుగుతాయమని దర్శకుడు రాజమౌళి ఇటీవల ప్రెస్మీట్లో చెప్పారు. దీంతో అంచనాలు తెగ పెరిగిపోతున్నాయి.