తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరణ్​జోహార్​ దర్శకత్వంలో జోడీగా రణ్​వీర్​-అలియా - కరణ్​ జోహార్​ వార్తలు

బాలీవుడ్​ ప్రముఖ నిర్మాత కరణ్​ జోహార్​ త్వరలోనే ఓ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అందులో రణ్​వీర్​ సింగ్​, అలియా భట్​ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించనున్నారు.

Alia-Ranveer in romantic drama directed by KJo
కరణ్​జోహార్​ దర్శకత్వంలో జోడీగా రణ్​వీర్​-అలియా

By

Published : Jan 31, 2021, 9:21 PM IST

ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాతగా కరణ్‌ జోహార్‌ ఎన్నో చిత్రాలు నిర్మించారు. అయితే ఇప్పుడు మరోసారి ఆయన మెగాఫోన్‌ చేతబట్టనున్నారు. అలియా భట్‌ - రణ్​వీర్‌ సింగ్‌ జంటగా ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ ప్రాజెక్టుకు తానే నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ప్రేమకథా చితానికి సంబంధించిన స్క్రిప్టు తదితర వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

కరణ్‌ చివరిసారిగా దర్శకత్వం వహించిన సినిమా 'ఏ దిల్ హై ముష్కిల్‌'. ఇందులో రణ్‌బీర్‌కపూర్‌, ఐశ్వర్యరాయ్‌, అనుష్క శర్మలు నటించారు. తర్వాత వెబ్‌సీరీస్‌గా తెరకెక్కిన 'లస్ట్‌ స్టోరీస్'‌ ఎపిసోడ్ - 4 కరణ్ జోహార్ దర్శకత్వం చేపట్టారు. దీంతో పాటు మరో సినిమా 'ఘోస్టో స్టోరీస్'‌కూ సంయుక్త దర్శకుడిగా ఉన్నారు.

అలియా భట్​, రణ్​వీర్​ సింగ్

ఇక రణ్​వీర్​ సింగ్ కథానాయకుడిగా కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో నటించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం అలియా భట్ హిందీలో 'గంగూబాయి కతియావాడి'తో పాటు రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న 'ఆర్.‌ఆర్.‌ఆర్'‌ చిత్రంలోనూ నటిస్తోంది. మరోవైపు రోహిత్​శెట్టి రూపొందిస్తోన్న 'సర్కస్​' సినిమాలోనూ అలియా హీరోయిన్​గా ఎంపికైంది.

అలియా భట్​, రణ్​వీర్​ సింగ్

ఇదీ చూడండి:'3డీ'లో రామాయణం.. రావణుడిగా హృతిక్​!

ABOUT THE AUTHOR

...view details