బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్బీర్ కపూర్, ఆలియా భట్ త్వరలోనే కొత్త ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారు. దానికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ముంబయిలోని పాలి హిల్ ప్రాంతంలో నిర్మితమవుతోన్న ఈ ఇంటి పనులను తాజాగా పరిశీలించారు రణ్బీర్, ఆలియా. వీరితో పాటు రణ్బీర్ తల్లి నీతూ కపూర్ కూడా ఉన్నారు.
కొత్త ఇంటిని పరిశీలించిన రణ్బీర్, ఆలియా - కొత్త ఇంటి నిర్మాణ పనుల్లో రణ్బీర్ ఆలియా
బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్బీర్ కపూర్, ఆలియా భట్ ముంబయిలోని తమ కొత్త ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. వీరితో పాటు రణ్బీర్ తల్లి నీతూ కపూర్ కూడా ఉన్నారు.
రణ్బీర్, ఆలియా
ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర' చిత్రం కోసం కలిసి పనిచేస్తున్నారు రణ్బీర్, ఆలియా. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీని తర్వాత రణ్బీర్.. సందీప్ రెడ్డి వంగాతో 'ఎనిమిల్' చిత్రం చేస్తుండగా.. 'ఆర్ఆర్ఆర్', 'గంగూబాయ్ కతియావాడి' చిత్రాలతో బిజీగా ఉంది ఆలియ.