Alia bhatt sanjay leela bhansali: ఆలియా భట్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీసిన చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు భన్సాలీ ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం చెప్పారు. 'గంగూబాయి..' కథ వినగానే ఆలియా భట్ కంగారుపడి తన ఆఫీసు నుంచి పారిపోయిందట. ఆ తర్వాత మళ్లీ కలిసి ఓకే చెప్పిందని తెలిపారు.
"ఈ సినిమాలో ఆలియానే ఎంచుకోవాలని మొదటి నుంచి అనుకున్నాను. అందుకే, నా ఆఫీస్‌లో కూర్చొని ఆమెకు కథ చెప్పా. అందులో తన పాత్ర గురించి విని అలియా షాక్ అయింది. వెంటనే తన బ్యాగును పట్టుకొని ఆఫీస్ నుంచి పారిపోయింది. దీంతో నేను మరో హీరోయిన్‌ను వెతుక్కోవాల్సి వస్తుందేమోనని అనుకున్నా. కానీ, తర్వాత ఆలియానే ఫోన్ చేసి మరోసారి కలుద్దామని చెప్పింది. తర్వాత కథ నచ్చి ఒప్పుకొంది. అలా ఈ చిత్రం పట్టాలెక్కింది" అని భన్సాలీ చెప్పుకొచ్చారు.