Gangubai new release date: ఒమిక్రాన్ ఎఫెక్ట్ మరో సినిమాపై పడింది. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన 'గంగూబాయ్ కతియావాడి' మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
నిజ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాలో గంగూబాయ్ అనే వేశ్యగృహం యజమానిగా ఆలియా నటించింది. అజయ్ దేవ్గణ్ కీలకపాత్ర పోషించారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు.
అయితే ఈ సినిమాను తొలుత జనవరి 7న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ 'ఆర్ఆర్ఆర్' పోటీ ఉండకూడదని చెప్పి, పక్కకు తప్పుకొన్నారు. ఫిబ్రవరి 18న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఇప్పుడు మరో వారం ముందుకు జరిగి ఫిబ్రవరి 25న ప్రేక్షకులను పలకరిస్తామని స్పష్టం చేశారు.