దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కూడా కనిపించనుంది. ఈ పాటికే ఆమె షూటింగ్లో పాల్గొనాల్సి ఉండగా.. లాక్డౌన్ కారణంగా కుదరలేదు. పరిమిత ఆంక్షలతో పలు సినిమాలు తిరిగి చిత్రీకరణ జరుపుకొంటున్నా.. 'ఆర్ఆర్ఆర్' మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు.
'ఆర్ఆర్ఆర్' కోసం ఆలియా పూర్తి డేట్స్.. కానీ! - రాజమౌళి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం నవంబరులో తిరిగి షూటింగ్ ప్రారంభించుకోనుందని సమాచారం. ఈ క్రమంలోనే ఆలియా భట్ రెండు నెలలకు పూర్తి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, నవంబరులో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆలియా నవంబరు, డిసెంబరు నెలల మొత్తానికి డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఆ సమయంలోనే తన పాత్రకు సంబంధించిన మొత్తం చిత్రీకరణ పూర్తి చేయాలని రాజమౌళిని కోరిందట. మరి ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే షూటింగ్ మొదలయ్యే వరకు ఎదురుచూడాల్సిందే.
ఈ చిత్రంలో ఆలియా భట్‌తో పాటు ఒలీవియా మోరిస్ హీరోయిన్గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. 'బాహుబలి' విజయం తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడం వల్ల ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.