తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆలియా అదరగొట్టేసింది.. 'గంగూబాయ్' ట్రైలర్ కేక! - ఆలియా భట్ ఆర్ఆర్ఆర్

Alia bhatt new movie: 'ఆర్ఆర్ఆర్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాల్సిన ఆలియా.. అంతకు ముందే 'గంగూబాయ్'గా థియేటర్లలోకి రానుంది. ఆ చిత్ర ట్రైలర్​ను శుక్రవారం విడుదల చేయగా, అభిమానుల్ని అది విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Alia bhatt Gangubai Kathiawadi
ఆలియా భట్ గంగూబాయ్ మూవీ

By

Published : Feb 4, 2022, 3:17 PM IST

Updated : Feb 4, 2022, 5:06 PM IST

Gangubai Kathiawadi Trailer: ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన 'గంగూబాయ్ కతియావాడి' ట్రైలర్ రిలీజైంది. ముంబయిలోని మాఫీయా క్వీన్‌ గంగూబాయ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీశారు. కరోనా వల్ల ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది.

"కామాటిపురలో అమావాస్య రాత్రి కూడా వెలుగు ఉంటుంది ఎందుకంటే అక్కడ గంగూబాయ్‌ ఉంటుంది" అని అజయ్‌ దేవ్‌గణ్‌ చెప్పే డైలాగ్‌లతో ప్రారంభమైన ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం ఆకట్టుకునేలా ఉంది. గంగూబాయ్‌గా ఆలియా నటన అదరగొట్టేలా సాగింది.

"మీకు నా మాటలు అభ్యంతరకరంగా అనిపించొచ్చు. కానీ, జాగ్రత్తగా వినండి. నిజం చెప్పాలంటే మీకంటే ఎక్కువ గౌరవం మాకే ఉంది. ఎందుకు అని అడగాలనుకుంటున్నారా? ఒక్కసారి మీరు మర్యాదను పోగొట్టుకుంటే.. మొత్తంగా పోయినట్టే. కానీ మేము ప్రతి రాత్రి గౌరవాన్ని అమ్ముకుంటాం. కానీ మా గౌరవం ఎప్పటికీ పోదు" అని ఆలియా చెప్పే డైలాగ్‌లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Feb 4, 2022, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details