బాలీవుడ్లో చారిత్రక సినిమాలు అంటే టక్కున గుర్తొచ్చే దర్శకుడి పేరు సంజయ్ లీలా భన్సాలీ. 'పద్మావత్', 'బాజీరావ్ మస్తానీ' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం హీరోయిన్ ఆలియా భట్‌తో 'గంగూబాయ్ కతియవాడి' తీస్తున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.12 కోట్లు పెట్టి ఓ స్టూడియోలో సెట్ వేశారట. అయితే కరోనా కారణంగా ఇప్పుడు చిత్రీకరణ నిలిచిపోయింది.
ఆలియా భట్ కొత్త సినిమా నిర్మాతలకు భారీ నష్టం!
ఆలియా భట్ నటిస్తున్న 'గంగూబాయ్' నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదముంది. రూ.12 కోట్లతో వేసిన ఓ సెట్లో చిత్రీకరణ కరోనా కారణంగా నిలిచిపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
ఆలియా భట్
1960ల నాటి ముంబయిని తలపించేలా ఈ సెట్‌ను తీర్చిదిద్దారు. రోజుల గడిచేకొద్దీ, మిగతా చిత్రాలకు ఈ సెట్ అడ్డం కానుంది. అప్పుడు కచ్చితంగా పడగొట్టాల్సి ఉంటుంది. ఇదే జరిగితే చిత్రనిర్మాణ సంస్థ భారీగా నష్టపోయే ప్రమాదముంది. ఈ ప్రాజెక్టును భన్సాలీ ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.