తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సోషల్​ మీడియా అలా తయారైంది: ఆలియా

ప్రజలను ఒక్కటి చేసే సోషల్ మీడియా.. ఇప్పుడు వారిని వేరు చేస్తోందని బాలీవుడ్​ నటి​ ఆలియా భట్​ చెప్పింది.

By

Published : Jul 3, 2020, 5:35 PM IST

Alia Bhatt feels social media meant to connect people is dividing them
సోషల్​ మీడియా ప్రజలను విభజిస్తోంది:ఆలియా

ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు ప్రజల్ని ఒక్కటి చేయడం లేదని, విభజిస్తున్నాయని బాలీవుడ్​ ప్రముఖ నటి ఆలియా భట్ చెప్పింది. అకాడమీ ఆఫ్​ మోషన్​ పిక్షర్స్​ ఆర్ట్స్​ అండ్​ సైన్సెస్​లో తనను సభ్యురాలిగా చేరాలని ఆహ్వానం పంపడంపై వారికి కృతజ్ఞతలు తెలిపింది.

"అకాడమీ సభ్యురాలిగా చేరాలని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ఇది ఎంతో గౌరవంగా భావిస్తున్నా. భారతీయ సినిమా ఖ్యాతి ప్రపంచస్థాయి వేదికపై వినిపిస్తోందనే సంతృప్తి కలుగుతోంది. భారత్​లోని సినీ నటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులను అకాడమీ గుర్తించడం విశేషం. ఈ విధంగా భారతీయ చిత్రసీమ ప్రపంచంలోని అందరి హృదయలను గెలుచుకునేందుకు ఓ అవకాశంగా మారుతుంది"

ఆలియా భట్​, ప్రముఖ నటి

"సినిమా, నీరు ఒకేలా ఉంటాయి. జాతి, హద్దు లాంటి పట్టింపులు లేకుండా స్వేచ్ఛగా ప్రవహిస్తాయి. ఉద్రేకంలో సినిమాను ప్రేమించే లేదా ద్వేషించే ప్రేక్షకులు, దీన్ని విడదీసే విమర్శకులు, వాటితో ప్రభావితమయ్యే విద్యార్థులు.. ఇలా ఎవరైనా సరే సినిమా గురించి చెప్పిన అభిప్రాయాలు భిన్నంగా ఉండవచ్చు. కానీ, సినిమా అనేది ఓ శక్తివంతమైన మాధ్యమం. అయితే ప్రజలను ఒక్కటి చేసేందుకు​ సృష్టించిన సోషల్​ మీడియా.. ప్రస్తుతం వారిని వేరు చేస్తోంది" అని ఆలియా చెప్పుకొచ్చింది.

ఇటీవలే బాలీవుడ్​ తారలు ఆలియా భట్​, హృతిక్​ రోషన్​ సహా 819 మంది కళాకారులు, ఎగ్జిక్యూటివ్​లకు ఆస్కార్క్​ నుంచి ఆహ్వానం అందింది. ఇదే సమయంలో హిందీ చిత్రసీమలో బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఎక్కువగా ఉందని సినీ ప్రముఖులపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఆలియా.. సామాజిక మాద్యమాలపై ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇదీ చూడండి:విద్యాబాలన్ 'శకుంతల దేవి' ఈనెల చివర్లో

ABOUT THE AUTHOR

...view details