తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సడక్ 2'పై కోపం సరే.. మరి మిగతా సినిమాల పరిస్థితి?

ఆలియా భట్ 'సడక్ 2' సినిమా, ఐఎమ్​డీబీ చరిత్రలోనే అతి తక్కువ రేటింగ్​తో చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ చిత్రం వరకు సరే కాని రానున్న కాలంలోనూ ఇలాంటి పరిణామాలే ఎదురైతే మాత్రం బాలీవుడ్​పై తీవ్ర ప్రభావం పడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Alia Bhatt and Mahesh Bhatt's Sadak 2 Becomes Lowest-rated Film of All Time on IMDb With 1.1 Score
సడక్ 2 సినిమా

By

Published : Aug 30, 2020, 6:53 PM IST

Updated : Aug 30, 2020, 7:01 PM IST

యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నెపోటిజమ్ అంశమై నెటిజన్స్ అంతెత్తున ఎగిరిపడుతున్నారు. బంధుప్రీతి కారణంగానే సుశాంత్ చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓటీటీలో విడుదలైన 'సడక్‌-2'పైనా ఈ ప్రభావం తీవ్రంగా పడింది. ఇందులోని నటీనటులే లక్ష్యంగా, తమ కోపాన్ని చూపిస్తున్నారు.

'సడక్‌-2' సినిమా ట్రైలర్​ను యూట్యూబ్‌లో ఉంచిన నిమిషాల్లోనే విపరీతంగా డిస్‌లైక్‌ చేయడం ప్రారంభమైంది. ఇప్పటివరకూ ఏ చిత్రానికి రాని విధంగా కోటి 20 లక్షలకుపైగా డిస్‌లైక్స్‌ వచ్చాయి. దీనంతటికీ నెపోటిజమ్ ప్రధాన కారణమని అభిమానులు, కామెంట్స్​లో పేర్కొంటున్నారు.

సడక్ 2 సినిమా పోస్టర్

ఈ చిత్ర ట్రైలర్‌ను డిస్‌లైక్‌ చేయటానికే ఏకంగా 10 గూగుల్‌ ఎకౌంట్లను కొత్తగా క్రియేట్‌ చేసుకున్నట్లు ఓ నెటిజన్‌ పేర్కొన్నారు. కొందరు చూసి డిస్‌లైక్‌ కొడుతుంటే, మరికొందరు చూడకుండానే డిస్‌లైక్స్‌ కొడుతున్నారు. ట్రైలర్‌కు లైక్‌ కొట్టిందనే కారణంగా ఏకంగా తన ప్రేయసినే వదిలేసినట్లు ఓ వ్యక్తి పేర్కొనడం, ఏ స్థాయిలో నెపోటిజాన్ని వ్యతిరేకిస్తున్నారో స్పష్టం చేస్తోంది.

విపరీతమైన ట్రోలింగ్‌ల మధ్య ఆగస్టు 28న OTT వేదికగా 'సడక్‌-2' విడుదలైంది. అయితే చరిత్రలోనే అత్యంత తక్కువ రేటింగ్‌ వచ్చిన సినిమాగా ఇది నిలిచింది. ఐఎమ్​డీబీలో ఎన్నడు లేనంత తక్కువగా దీనికి 1.1 రేటింగ్‌ వచ్చింది.

సడక్ 2 సినిమాలో ఆలియా భట్

ప్రస్తుతం 'సడక్‌-2' మాత్రమే పరిమితమైన నెటిజన్ల ఆక్రోశం.. భవిష్యత్‌లో మరిన్నీ సినిమాలపైనా కన్పిస్తుందేమోనని విశ్లేషకులు భయపడుతున్నారు. ఇలానే ఉంటే నిర్మాతలు, నటులు, చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Aug 30, 2020, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details