తేజ దర్శకత్వంలో నటించిన తన తొలి తెలుగు సినిమా 'జయం'లో అవకాశం ఎలా వచ్చిందో వివరించారు నటి సదా(Sadha). తాను దిగిన చెత్త ఫొటోలను చూసి తేజ సినిమా ఛాన్స్ ఇచ్చారని హాస్యస్పదంగా చెప్పారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా''(Alitho Saradaga) కార్యక్రమానికి ఈ వారం అతిథిగా విచ్చేసిన సదా ఈ విషయాన్ని తెలిపారు. ఆ సినిమా షూటింగ్‌లోని పలు సందర్భాలను గుర్తుచేసుకున్నారు.
Alitho Saradaga: ఆ డైలాగ్ వెనుక అంత కథ ఉందా? - ఆలీతో సరదాగా లేటెస్ట్ ప్రోమో
ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga) సెలబ్రిటీ టాక్ షోకు ఈ వారం అతిథిగా హాజరయ్యారు నటి సదా. తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తొలి తెలుగు సినిమా 'జయం'లో అవకాశం ఎలా వచ్చిందో వివరించారు. ఆ సినిమాలోని 'వెళ్లవయ్యా వెళ్లూ' డైలాగ్ కోసం చాలా టేక్‌లు తీసుకున్నట్లు చెప్పారు.
![Alitho Saradaga: ఆ డైలాగ్ వెనుక అంత కథ ఉందా? Ali to Saradaga](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12307182-952-12307182-1625020930019.jpg)
"యాక్టింగ్ నేర్చుకోవడంలో భాగంగా ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కోసం ఫొటోలు దిగాను. అవి చాలా దరిద్రంగా, చండాలంగా ఉన్నాయి. కానీ ఆ ఫొటోల వల్లే తెలుగు సినిమా అవకాశం వచ్చింది. అప్పటికే ఓ సినిమా కోసం బాంబే వెళ్లాను. ఈ చండాలమైన ఫొటోలు చూసే తేజగారు నా కోసం అక్కడికి వచ్చారు. నేను మా నాన్నగారు కలిసి ఆయన్ను కలిశాం. అలా సినిమాలో ఛాన్స్ వచ్చింది. అయితే షూటింగ్లో అన్ని సన్నివేశాలు ఒక్క షాట్‌లోనే బాగా వచ్చాయి. కానీ 'వెళ్లవయ్యా వెళ్లూ' డైలాగ్ మాత్రం ఎన్ని సార్లు చేసినా తేజకు నచ్చినట్లు రావట్లేదు. అది ఎందుకు నచ్చలేదో అర్థం కాలేదు. 'ఇది నవ్వు బాగా చేస్తే, నువ్వు ఎక్కడికో వెళ్లిపోతావ్, నేను చెప్పినట్టే చేయ్' అని గట్టిగా చెప్పారు. ఇక ఆయన చేసినట్టే మిమిక్రీ చేసి చూపాను. అది చాలా పెద్ద హిట్ అయింది. కానీ ఈ సినిమా అంత పెద్ద హిట్ అయినా రెండు మూడు నెలల వరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఆ తర్వాత వరుసగా ఛాన్స్‌లు వచ్చాయి." అని తెలిపారు.
ఇదీ చూడండి: ఆ షూటింగ్లో సదా ఎందుకు ఏడ్చింది?.. తేజ కొట్టారా?