అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలను తెరకెక్కించడం ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ramgopal Varma) ప్రత్యేకత. అయితే ఇన్ని కథలు తనకు ఎక్కడ నుంచి వస్తాయి అనేది అందరికీ ప్రశ్నే! దీనిపై చమత్కారంగా స్పందించారు ఆయన. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(Ali to Saradaga) కార్యక్రమానికి గతంలో అతిథిగా విచ్చేసిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ఇందులో భాగంగానే తన కెరీర్‌కు సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు.
RGV: 'దావుద్ కూతురు.. లాడెన్ మనవరాలంటే ఇష్టం' - రామ్‌గోపాల్ వర్మ ఆలీతో సరదాగా
ఓసారి 'ఆలీతో సరదాగా'(Ali to Saradaga) కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ramgopal Varma) పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా సినీఇండస్ట్రీలో కాకుండా బయట తనకు ఇష్టమైన అమ్మాయి గురించి చెప్పారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లో బాలయ్య అంటే తనకు ఇష్టమని చెప్పారు.
తనకు విపరీతంగా కోపం వచ్చిన ఓ సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. హీరో పవన్‌కల్యాణ్ అభిమానులు తనను అర్థం చేసుకోలేకపోయారని అన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌లో బాలయ్య అంటే తనకు ఇష్టమన్నారు. అయితే అందుకు గల కారణాన్ని వివరించలేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ అమ్మాయి అంటే ఇష్టమని అడిగిన ప్రశ్నకు రాజకీయ నాయకురాలు ప్రియాంకా గాంధీ అని చమత్కారంగా చెప్పారు. దావుద్ ఇబ్రహీం కూతురు, ఒసామా బిన్ లాడెన్ మనవరాలు కూడా ఇష్టమని చెప్పి నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన వీడియోను చూసేయండి..
ఇదీ చూడండి: రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో మరోసారి అమితాబ్?