తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే ఓ పాటకు కొరియోగ్రఫీ చేశానని తెలిపారు నటి ముమైత్ ఖాన్. చిన్నప్పటి నుంచి టీవీ చూస్తూనే డ్యాన్స్ నేర్చుకున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే సెలిబ్రిటీ టాక్ షో 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన ముమైత్ ఎన్నో విషయాలు పంచుకున్నారు.
ఇండియన్ షకీలాగా పేరు తెచ్చుకున్న ముమైత్ ఖాన్ తన గురువు.. దర్శకుడు రెమో అని అన్నారు. ఆయన కొరియోగ్రాఫీ చేసిన ఓ పాటలో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా తొలి అవకాశం వచ్చిందని చెప్పారు. అప్పుడు తాను అందుకున్న జీతం రూ.750 అని తెలిపారు.