'ఎన్నో లగ్జరీ కార్లలో తిరిగిన నేను ఈ రోజు క్యాబ్‌లో వెళ్లాల్సిన పరిస్థితి.. వాళ్లు నన్ను నమ్మించి మోసం చేశారు' అంటూ నటి జయలలిత భోరున విలపించారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి నటి జయలలితతో పాటు సీనియర్ ఆర్టిస్ట్ వరలక్ష్మి అతిథులుగా విచ్చేశారు.
వ్యాంప్ పాత్రల్లో జయలలిత ఎందుకు నటించారంటే?
ఆలీతో సరదాగా కార్యక్రమానికి నటి జయలలిత, సీనియర్ ఆర్టిస్ట్ వరలక్ష్మి విచ్చేసి.. వారి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వారు ఎదుర్కొన్న కష్టాలు, పేరు తీసుకొచ్చిన సంఘటనలను వివరించారు. ఈ కార్యక్రమం సోమవారం రాత్రి 9.30గంటలకు ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను చూసేయండి.
ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో వారి ప్రయాణం ఎలా మొదలైంది, 'శంకారభరణం'లో వరలక్ష్మి ఎలా నటించింది, వ్యాంప్ పాత్రల్లో జయలలిత ఎందుకు చేయాల్సి వచ్చిందో షోలో వివరించారు. జయలలితను సీరియల్ నిర్మాతలు మోసం చేసిన తీరును వివరిస్తుంటే ప్రతి ఒక్కరు కంటితడి పెట్టుకోక మానరు. సినీ రంగంలో వారి ప్రయాణం ఎలా సాగింది.. జీవితంలో వారు పడిన కష్టాలు, వారికి పేరు తీసుకొచ్చిన సంఘటనలు తెలుసుకోవాలని ఉందా.. అయితే సోమవారం ఈటీవీలో రాత్రి 9:30గంటలకు మిస్ కాకండి. మరి అప్పటిదాకా ఈ ప్రోమోను చూసేయండి.