తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రిచాతో నా పెళ్లి అప్పుడే: అలీ ఫజల్​ - అలీ ఫజల్​

వాయిదా పడుతూ వస్తున్న(ali richa marriage) తన పెళ్లి వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగుతుందని చెప్పాడు బాలీవుడ్ నటుడు అలీ ఫజల్​. ప్రేయసి రిచా చద్దాతో కొన్నేళ్లుగా ఇతడు సహజీవనం చేస్తున్నాడు.

ali richa
అలీ రిచా

By

Published : Oct 1, 2021, 5:31 AM IST

కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న(ali fazal richa chadha marriage) బాలీవుడ్​ ప్రేమజంట రిచా చద్దా, అలీ ఫజల్​.. పరిస్థితి బాగుండి ఉంటే ఇప్పటికే మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యేవారు. కానీ కరోనా సహా ఇతరత్రా కారణాల వల్ల వారి వివాహం ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అలీ(ali fazal richa chadha lovestory).. తమ పెళ్లిపై స్పందించాడు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో పక్కాగా పెళ్లిపీటలు ఎక్కుతామని చెప్పాడు. ప్రస్తుతానికి డేట్​ ఫిక్స్​ అవ్వలేదని అన్నాడు.

"వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటాం. అయితే తేదీ ఇంకా నిర్ణయించలేదు. కరోనా నిబంధనలు పాటిస్తూ కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో మా వివాహం జరుగుతుంది. ప్రస్తుతం మేమిద్దరం మా సమయాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నాం. రిచా తన పనులతో బిజీగా ఉంది. సమయం దొరికినప్పుడల్లా కలిసి సరదాగా ఉంటున్నాం."

-అలీ ఫజల్​, నటుడు.

2012లో ఓ సినిమా షూటింగ్​లో అలీ, రిచాల(ali fazal and richa chadha wedding) మధ్య స్నేహం చిగురించింది. 2015లో ప్రేమలో పడినప్పటికీ.. 2017లో అభిమానులకు ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. 2020 ప్రారంభంలో మాల్దీవుల్లో రిచాకు అలీ(ali fazal richa chadha) మ్యారేజ్​ ప్రపోజ్​ చేశాడు.

ఇదీ చూడండి: గోల్డెన్​ డ్రెస్​లో రాశీఖన్నా.. చార్లీ చాప్లిన్‌గా నభా

ABOUT THE AUTHOR

...view details