ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ సమర్పణలో వస్తోన్న త్రీడీ చిత్రం 'లయన్ కింగ్'. ప్రపంచ వ్యాప్తంగా జులై 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు క్రేజ్ పెంచేందుకు ఆయా భాషల్లో పేరున్న నటుల చేత డబ్బింగ్ చెప్పిస్తున్నారు.
తెలుగు వెర్షన్లో పుంబా(అడవి పంది) పాత్రకు బ్రహ్మానందం, టిమోన్(ముంగిస) పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పారు. హిందీ సినిమాలో సింహం, సింహం పిల్ల పాత్రలకు షారుఖ్ ఖాన్, అతడి కొడుకు ఆర్యన్ ఖాన్ గాత్రదానం చేశారు.