మలయాళ ప్రముఖ దర్శకుడు అలీ అక్బర్ మతం మార్చుకున్నారు. ఇస్లాం మతాన్ని విడిచి హిందువుగా మారానని, తన పేరును రామసింహంగా చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఫేస్బుక్ లైవ్‌లో వెల్లడించారు. అలానే తన కుటుంబం మొత్తం ఇప్పటినుంచి భారతీయ సంప్రదాయాలను పాటిస్తామని అన్నారు.
ఏం జరిగింది?
సీడీఎస్ బిపిన్ రావత్.. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇదే విషయమై ఈ డైరెక్టర్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌కు స్మైల్ ఏమోజీని కామెంట్ రూపంలో పెట్టారు ఓ నెటిజన్. ఇది తన మనసుకు ఎంతో బాధపెట్టిందని ఈ దర్శకుడు చెప్పారు.