తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ర్యాప్​ తరహాలో 'ఓ మై గాడ్​ డాడీ' పూర్తి పాట...

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న 'అల.. వైకుంఠపురములో..' సినిమా నుంచి 'ఓ మై గాడ్​ డాడీ' పూర్తి పాట విడుదలైంది. ఈ సాంగ్​ను వీడియో,​ లిరిక్స్​​ కలిపి రూపొందించారు.

By

Published : Nov 22, 2019, 6:14 PM IST

Updated : Nov 22, 2019, 7:23 PM IST

ర్యాప్​ తరహాలో 'ఓ మై గాడ్​ డాడీ' పూర్తి పాట...

బన్నీ గత చిత్రాలకు భిన్నంగా 'అల... వైకుంఠపురంలో' సినిమా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు, ప్రోమోలు సహా 'సామజవరగమన, 'రాములో రాములా' పాటలతో మరింత జోరు పెంచారు. తాజాగా మూడో పాట 'ఓ మై గాడ్​ డాడీ'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. దీన్ని వీడియో, లిరిక్స్​ మిక్స్​ చేసి... ర్యాప్​ తరహాలో అద్భుతంగా రూపొందించాడు సంగీత దర్శకుడు తమన్​. దీన్ని రాహుల్​ సిప్లింగంజ్​ పాడగా... రోల్​రైడా, రాహుల్​ నంబియార్​, లేడీ కాశ్​, బ్లేజ్ కలిసి కోరస్​ అందించారు.​ ఈ పాటలో చిత్రబృందంలోని ప్రముఖుల రియల్​ నాన్నలను చూపించడం విశేషం.

బన్నీ 19వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో ఈ స్టార్​హీరో 'బంటు' పేరున్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. పూజా హెగ్డే కథానాయిక. టబు, జయరాం, నివేదా పేతురాజ్‌, సుశాంత్‌, సునీల్‌ తదితరులు నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' వంటి హిట్‌ చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Last Updated : Nov 22, 2019, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details