తెలంగాణ

telangana

మాస్, క్లాస్​ కాంబినేషన్​తో 'అల వైకుంఠపురములో' టీజర్

By

Published : Dec 11, 2019, 4:07 PM IST

Updated : Dec 11, 2019, 4:23 PM IST

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'అల వైకుంఠపురములో' టీజర్​ విడుదలైంది. ఆద్యంతం అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

'అల వైకుంఠపురములో' టీజర్​
'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 'అల వైకుంఠపురములో' టీజర్​ వచ్చేసింది. బన్నీ స్టైల్​, త్రివిక్రమ్​ మాటల మాయాజాలం.. ఇందులో కనిపించాయి. హాస్యం, యాక్షన్, ఎమోషన్​ తదితర అంశాలతో రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా నటించింది. నివేదా పేతురాజ్​ మరో కథానాయిక. సుశాంత్, నవదీప్​, టబు, జయరాజ్​ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.

'మీ నాన్న పెళ్లి కూతుర్ని దాచినట్లు దాచాడు నిన్ను.. సరిగా చూడలేదు ముందుకు రా', 'స్టైల్​గా ఉంది కదా.. నాక్కుడా నచ్చింది', 'మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్​ ఎక్కాను' వంటి డైలాగ్​లు అలరిస్తున్నాయి.

ఇప్పటికే వచ్చిన 'రాములో రాములా', 'సామజవరగమన' పాటలు రికార్డు బద్ధలు కొడుతూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. ఇప్పుడొచ్చిన టీజర్​ ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Last Updated : Dec 11, 2019, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details