అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం 'అల.. వైకుంఠపురములో'. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఫిల్మ్వర్గాల సమాచారం.
ఇప్పటికే విడుదలైన ప్రోమో, పోస్టర్లు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో టబు కీలక పాత్ర పోషిస్తోంది. ఇతర పాత్రల్లో జయరాం, మురళీశర్మ తదితరులు నటిస్తున్నారు.