తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గ్యాప్​ ఇవ్వలా.. వచ్చింది' అంటున్న బన్నీ - teaser

అల్లు అర్జున్ కొత్త సినిమాకు 'అల వైకుంఠపురంలో..' అనే టైటిల్​ను​ ఖరారు చేసింది చిత్రబృందం. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. పూజాహెగ్డే కథానాయిక.

అల వైకుంఠపురం

By

Published : Aug 15, 2019, 11:54 AM IST

Updated : Sep 27, 2019, 2:10 AM IST

అల్లుఅర్జున్​, త్రివిక్రమ్ కాంబినేషన్​లో వస్తోన్న మూడో చిత్రం టైటిల్​ను​ ఖరారు చేశారు. 'అల వైకుంఠపురంలో..' అనే పేరుతో సినిమా టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పటికే ఏడాదిపైగా విరామం తీసుకున్న అల్లు అర్జున్ ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

తాను గ్యాప్​ తీసుకున్న విషయాన్ని సెటైరికల్​గా టీజర్​లో వాడారు. 'ఏంట్రో గ్యాప్ ఇచ్చావ్..' అని నటుడు మురళి శర్మ అడుగగా.. 'గ్యాప్​ ఇవ్వలా.. వచ్చింది' అంటూ పంచ్ పేల్చాడు స్టైలిష్ స్టార్. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్​ సంగీతం సమకూరుస్తున్నాడు.

త్రివిక్రమ్ తీసిన చిత్రాల్లో 'అ' తో మొదలైన వాటిలో ఈ సినిమా ఐదోది. ఇంతకుముందు అతడు, అత్తారింటికి దారేది, అ..ఆ, అరవింద సమేత ఇప్పుడు అల వైకుంఠపురంలో.. ఇలా 'అ' సెంటిమెంట్​తో వచ్చిన త్రివిక్రమ్ సినిమాలన్నీ సూపర్​హిట్​ అయ్యాయి.

పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: మావి కూడా 'కౌశల్య కృష్ణమూర్తి' కష్టాలే: మిథాలి

Last Updated : Sep 27, 2019, 2:10 AM IST

ABOUT THE AUTHOR

...view details